![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -945 లో.. రిషి ఎక్కడికి వెళ్ళాడని చూడడానికి వసుధార బయటకు వస్తుంది. అప్పుడే వర్క్ ఉంటే బయటకు వచ్చానని వసుధారకు మెసేజ్ చేస్తాడు రిషి. కాసేపటికి వసుధార దగ్గరకు మహేంద్ర వచ్చి.. రిషి ఎక్కడ అని అడుగుతాడు.
వర్క్ మీద బయటకు వెళ్ళారట అని వసుధార చెప్తుంది.. శైలేంద్ర ఇది కూడా డ్రామా చేస్తున్నాడేమోనని మహేంద్ర అనగానే.. ధరణి మేడమ్ ముందే ఇదంతా జరిగిందని చెప్తుంది కదా అని వసుధార అనగానే.. ఇదంతా ధరణి నిజమే అనుకోవాలని అలా చేసాడేమోనని మహేంద్ర అంటాడు. రిషి సర్ ఇంక రావడం లేదని వసుధార టెన్షన్ పడుతుంటే.. అసలు దీనికి కారణం శైలేంద్ర అని వాయిస్ రికార్డింగ్ విని తట్టుకోలేక పోయాడు రిషి. అందుకే శైలేంద్ర దగ్గరకు రాలేదని మహేంద్ర చెప్తాడు. ఆ తర్వాత మహేంద్ర , వసుధారలు కలిసి ధరణి దగ్గరకి వెళ్లి.. అసలేం జరిగిందని కనుక్కోవాలనే ప్రయత్నం చేస్తారు. అసలు ఎలా జరిగింది ? వచ్చిన రౌడీలు శైలేంద్రతో ఎలా ఉన్నారని మహేంద్ర అనగానే.. శైలేంద్రపై డౌట్ పడుతున్నారని ధరణికి అర్థం అయి.. ఒక్కప్పుడు మా అయిన తప్పు చేసాడు కానీ ఇప్పుడు మారిపోయి మంచిగా ఉంటున్నాడని ధరణి అంటుంది.
మరొకవైపు శైలేంద్రకి బ్లడ్ కావాలని డాక్టర్ చెప్తాడు. ఫణింద్ర ఎవరికి కాల్ చేసిన ముందుకు రాకపోవడంతో.. చివరగా నీది శైలేంద్రది ఒకటే బ్లడ్ గ్రూప్ కదా ఇవ్వమని ఫణీంద్ర రిక్వెస్ట్ చెయ్యగానే.. మహేంద్ర బ్లడ్ ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఆ తర్వాత మహేంద్ర బ్లడ్ ఇస్తూ.. నీ కోసం నేను ఇవ్వడం లేదు. నువ్వు బతకాలి నువ్వు చేసిన తప్పులు బయటపడాలని ఇస్తున్నానని మహేంద్ర అంటాడు. ఆ మాటలు అన్ని విని శైలేంద్ర కళ్ళు తెరిచి చూస్తాడు. మహేంద్ర చూస్తాడేమోనని మళ్ళీ నటిస్తాడు. మరొక వైపు ముకుల్ హాస్పిటల్ కి వస్తాడు. శైలేంద్రని ఇన్వెస్టిగేషన్ చెయ్యాలని అనగానే కొంచెం బాగయ్యాక చేస్తే బెటర్ అని ఫణీంద్ర అంటాడు. అలా అనగానే మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? మీ కొడుకనా అని ముకుల్ అనగానే.. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |